Book Description
‘‘దేశ ప్రఖ్యాతిగాంచిన ఒక సైంటిస్ట్ జైలు గోడల మధ్య పిచ్చిగా కేకలు పెడుతూ చిందులూ వేస్తున్నాడు. ఒకనాడు అలాంటి పరిస్థితిలోనే ఉన్న నన్ను చూసి మనిషిని చెయ్యాలన్న ఆవేశంతో ఈ అపరిచితుడికి చేతినందించారు. ఈనాడు మీ భర్త దేశౌన్నత్యానికి ఎంతగానో ఉపయోగ పడవలసిన మీ భర్త - పిచ్చివాడై జైలుగోడల మధ్య మ్రగ్గిపోవడం చూస్తూ ఎలా నిర్లిప్తత వహించగలరు?... మీలోని మానవతావాదాన్ని ఎలా త్రోసి వేయగలరు?... మీరు అతనిని మనిషిని చెయ్యాలి’’ అన్నాడు మన్మోహన్. దేవసేన విద్యావంతురాలు... సంస్కారం గల మహిళ... (భర్తను ఒప్పించి) ఎపడూ ఎవ్వరూ చేయని గొప్ప ప్రయోగం చేసింది. పట్టుపట్టి భర్తను ఒప్పించి పిచ్చివాడైన ఒక పరాయి పురుషుణ్ని మామూలు మనిషిని చేసింది... ఇంత సాహసం చేసి తన అపూర్వమైన ప్రయోగంలో విజయం సాధించిన దేవసేకు మిగిలిందేమిటి? తీరని వేదన! అపార్థాల, అవమానాల బరువు? కాని ఆమెలో మంచితనం చావలేదు. అందుకే ఉచితమైన నిర్ణయం తీసుకుంది. విచిత్ర మానసిక విశేషణంతో కూడిన కథా సంవిధానంతో పాఠకులను అలరించి, ఆలోచింపజేసే నవల. నిశిరాత్రిలో నక్షత్ర ప్రభలు. చదవండి!