Book Description
పైకి పాషాణంలా కనిపించినా ఆ రాత్రిలో ఎన్నికోట్ల రాగాలు ఆలపించబడుతున్నాయో, ఆయన చూపుల నీడలో మేడ కట్టుకు ఉండాలని తన మనస్సెంతగా తహతహలాడి పోతున్నదో అతనికేం తెలుసు? అనుకున్నది సునీల. ఉదయ్ తనకేమి కాడా? తానతని కేమికాదా? అందరూ రోహిణీ ఉదయ్ భార్య అవుతుందనుకున్నారు. చనిపోయే ముందు అతని తండ్రి తన మిత్రుడికి తానెన్నడో చేసిన వాగ్దానం గురించి కొడుక్కి చెప్పి మరీ కళ్ళు మూశాడు. అపుడు ప్రారంభమయింది అసలు కథ. తీవ్రమయిన సంఘర్షణ. ‘‘దాని పీడ విరగడ చేసుకుంటేగాని నా మాట వినవు’’ అంది తల్లి కసిగా. కాని పెరుగుతున్న ప్రేమలతను త్రుంచి వేయలేని అశక్తత. ‘ప్రేమబంధం’ జయిస్తుందా? గుండెలు స్పందింపబడటానికి పరిష్కారమేమిటి?