Book Description
ఈ యుగంలో... ‘ఒక ఆడపిల్ల తన కాళ్లమీద తాను నిలబడితే సరిపోతుందా? ఏ పొలం పనికి వెళ్లినా మూడో, నాలుగో రూపాయలూ, శేరో, రెండు శేర్లో గింజలూ తెచ్చుకోగలదు. ఒక్క పొట్టకు తిండి సంపాదించుకోవడం కష్టమైన పని కాదు. ఆడపిల్లకు తిండికంటె, బట్టకంటె ముఖ్యంగా కావలసింది రక్షణ! ఆ రక్షణ ఏ మాత్రమూలేని సంధ్యలాంటి అతిసామాన్యురాలు, అభాగ్యురాలైన యువతి జీవిత దినదిన గుండమే... పైకి పచ్చపచ్చగా కనిపించే ఎన్నో ప్రాణాంతకమైన ఊబి గుంటలతో నిండినదీ లోకం... సంధ్యలాంటి స్వయం నిర్ణయశక్తిలేని అర్భకురాలి జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతుంది? అదృశ్య విధిశక్తి నడిపించినట్టు నడవడమేనా? లేక స్వయం చోదకత ఉంటుందా? అరుణ్ వంటి సహృదయ యువకుడు తోడైతే జీవితం వాళ్ల పెద్దలు ఆశించినట్టు స్వర్గతుల్యమే. లేదా కత్తుల చెరువు... నేటి కాలపు యువతీ యుకవలు ద్వంద్వ స్వభావాలను... భయాన్నీ, నిర్భీతినీ, సంశయాన్నీ, స్వయం నిర్ణయశక్తినీ, బలహీనతలనూ, శక్తినీ చిత్రిస్తూ అన్ని విరుద్ధ అంశాలకూ అద్దం పట్టిన వినూత్న రచన. ‘సంధ్యా కళ్యాణం’ చదవండి!