Book Description
.....వయసులో ఉండే ఆడపిల్ల, అందరిలాగే ఈ తొలిరేయిని ఎంతో మధురంగా ఊహించుకొంది. మనోహరంగా చిత్రించుకొంది... తన జీవితం పొడుగునా గుర్తుండిపోయేలా మనసులో ముద్ర వేసుకొంటుందనుకొంది... వాస్తవం ఊహలకి ఎంత భిన్నంగా ఉండగలదో ఎత్తిచూపుతోంది ఈ రాత్రి. నిర్ణీతమైన దారితప్పి ఒక్క అడుగు పక్కగా పడితే బ్రతుకు భళ్లున పగిలి ఎలా బద్దలైపోతుందో తెలుపుతోంది... అరిటాకు ముల్లుమీద పడినా, ముల్లు అరిటాకుమీద పడినా మోసం అరిటాకుకే అన్నది నిరూపించే నవల.