Book Description
ఈ దిగువ గోదావరి కథలు రాయడానికి ముందు వంశీగారు అధ్యయనం చేసుకోవడం కోసం కొన్ని నెలల పాటు కారుల్లోనూ, పడవల మీదా ప్రయాణం చేసి ఇక్కడున్న గ్రామాలు, పల్లెలు, లంకల్లో మకాం చేసి ఇక్కడి జీవితాన్ని కళ్ళారా చూసి వింతలు, విడ్డూరాలను అక్కడి ప్రజలు చెప్పగా చెవులారా విని, స్పందించి అందరికీ ఆసక్తికరంగా వుండేలా రాశారు. ఈ కథలన్నిటికీ బాపూ వేసిన బొమ్మలు మామూలు బొమ్మలు కావు. రూపానువాదాలు. టీకా తాత్పర్యాలు, అద్భుత వ్యాఖ్యానాలు. స్వాతి వారపత్రికలో 52 వారాలు ప్రచురింపబడిన ఈ కథలు దేనికదే మాస్టర్ పీస్. తప్పక చదవండి.