Book Description
”సృష్టిలో రకరకాల సౌందర్యాలు. కొన్నింటిని దూరాన్నుంచే చూస్తూ ఆనందించాలి. అవసరం కలిగేదాకా వాటికి దగ్గరవ్వకూడదు. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తే ఏమౌతుంది? అంతే అవుతుంది. వాటి ప్రత్యేకత, ప్రాముఖ్యత నశిస్తాయి. అవును. ఇక ఇంటికెళ్ళకూడదు. ఎంతకాలం వరకూ? కొన్ని సంవత్సరాల వరకూ. కృష్ణుడికోసం నీరజ ఎదురుచూసి చూసి కడకి ఆ తమాలవృక్షాల ఛాయల్లోనే సమాధి కాలేదూ???. ”అంతకాలం వరకూ జయ ఎదురుచూస్తుందా???”.\nమల్లెల ముగ్ధత్వానికీ, మంచి ముత్యాల తెలుపుకీ ప్రాణం పోసింది కారుణ్య. గులాబీల పరిమళానికీ, సంపెంగల సౌరభానికీ ఆయుష్షునిచ్చింది కారుణ్య. తేనెలో తియ్యదనానికీ, వెలగపండులో వగరుదనానికీ జీవితాన్నిచ్చింది కారుణ్యే. చెప్పడం చేతకాదుకానీ ఎంతందంగా వుంటుంది కారుణ్య. మీరా చాలా విచిత్రమైన మనిషి. ప్రతీ విషయం కుండబద్దలు కొట్టినట్టే మాట్లాడుతుంది. కేంటీన్‌కి రమ్మని పదిసార్లు పోరుపెడితే ఒక్కసారి మాత్రం వస్తున్నందుకు తనని చెడామడా తిట్టేస్తుంది. తన దగ్గర ఏదైనా పుస్తకం తీసుకుంటే తిరిగి ఆమె నుంచి తీసుకునే నాటికి లోపలా, పైనా ”మీరా… మీరా” సంతకాలు ముగ్గుల్లా నిండిపోయి వుంటాయి. తన రూమ్‌కి వస్తే అలారం ఫుల్ కీ ఇచ్చేస్తుంది. కర్ కర్ మనిపిస్తుంది. ట్రాన్షిష్టరు ఆన్ చేసి వాల్యూమ్ వీల్ ఆఫ్ చెయ్యకుండానే బాండ్ మార్చేస్తుంది. ఇలా అల్లరి చేస్తుంది మీరా. తన జీవితంలో ఓ అధ్యాయం ముగిసింది. మళ్ళీ కొత్తది మొదలవ్వబోతుంది. జీవితంలో ఎవరి ఆదరణా ప్రేమాభిమానాలు పొందలేకపోయాడు. ప్రతీ జీవరాశికీ శత్రువయ్యాడు. అడుగడుగునా ఓటమి నెదుర్కుంటూ, ఎవరికీ అర్థం కాలేకపోయాడు. అందరిచేతా అసహ్యించుకోబడ్డాడు. అయితేనేం… తను గెల్చాడు.