Book Description
ముగ్గురూ మూడు రకాల మనుష్యులు. దరిద్రంతో చావలేక, సముద్రంలో పడి చావలేక ఛస్తూన్న వాడికి, అకస్మాత్తుగా ఒక సుందరి సౌందర్య ధనం, ధనం దొరుకుతుంది. సౌందర్య ధనాన్ని, ధనాన్ని కొల్లగొంటాడతను. ఆమె : అంతకన్నను! దరిద్రము ముసలితనమూ ముందున్నప్పుడూ, డబ్బున్న ముసలితనం చేత పుస్తె కట్టించుకుని, దరిద్రంతో కుములుతూన్న పడుచుదనంచే శారీరకానందాన్ని పొందజూచిన వగలాడి. ఈమె : భర్త ప్రయోజకుడైన ఆనందంతో అసలు వ్యవహారం తెలిసీ తెలియనట్లు నటించి, సమయం కనిపెట్టి ఖళేరావ్ అన్నది.