Book Description
చిన్న పిల్లవాడిలాగు వెక్కి వెక్కి ఏడుస్తూ, సున్నితంగా ఆమెను తన చేతుల్లోకి తీసుకొని, తేలిగ్గా ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. యీ రకం ప్రేమను అతను జీవితంలో ఇంతకు ముందెప్పుడూ ప్రకటించి ఉండలేదు. దుఃఖంవల్ల పూడుకుపోయిన గొంతుతో అతను గొణిగాడు: ‘‘... నీకేమీ ఫరవాలేదు. మృత్యువుకు భయపడవొద్దు, క్రమంగా ఆరోగ్యం కలుగుతుంది. అప్పుడు మనమిద్దరమూ జీవితాంతంవరకూ ప్రేమించుకోవచ్చు - జీవితాంతం వరకూ!’’ బలహీనంగా నవ్వుతూ ఆమె అంది : ‘‘ఇదంతా నిజమేనా? నువ్వు నన్ను హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నావన్నమాట?’’ ఆమె దురదృష్టతకు జాలిగా అతను ఆ సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశాడు. ఆమె ఆరోగ్యవంతురాలయ్యాక తన ప్రేమను నిరూపించి తీరుతానని నమ్మకం కలిగించాడు. ప్రేమవల్ల కలిగే జాలితో - ఆమెను అనేకసార్లు ముద్దుపెట్టుకున్నాడు. ఉష్ణతాపంవల్ల ఎగిరెగిరిపడే ఆమె హృదయానికి ఎంతో ఆనందాన్ని చేకూర్చాడు. మరునాడు అతను తిరిగి వొచ్చేశాడు.. ఆమెకు మాత్రం యీ ప్రణయం దివ్యౌషధంగా పనిచేసింది.