Book Description
ఇంతవరకూ నాకు తెలీని విషయం - ఆమె నాకు అవబొయ్యే ధర్మపత్నా? ముక్కూ మొగమూ ఎరగని మమ్మల్ని దంపతులుగా తయారుచేస్తే, ముందున్న సంసార సాగరాన్ని యిద్దరమూ అన్యోన్యంగా ఈద వద్దా? నా అంగీకారమే అనవసరమనుకొన్నాడే నాన్న - ఆమెతో కాపరం చెయ్యవలసిన బాధ్యత నాక్కాదా? ఒకళ్ళ అభిప్రాయాల్తో ఒకళ్ళవి వీగిపోతూ, ఒకళ్ళను మరొకళ్ళు అర్థంచేసుకోలేక, అయోమయ జీవితానికి గురవుతే ఎవరి తప్పవుతుంది? తీరా దంపతులుగా అతుకుపడ్డ తరువాత - నీడలాగు అంటిపెట్టుకొని వుండే భార్యను వదలించుకోవటం చేతకాక, తప్పనిసరిగా వ్యక్తిత్వాన్నే మరిచిపోయి, కాపరం చెయ్యవలసి ఉంటుందేమో? అప్పుడు పశ్చాత్తాపపడి ఏం ప్రయోజనం? పెళ్ళి చేసుకొన్నాక బాధపడటంకన్నా, చేసుకోకుండానే ఉండటం మంచిదేమో? ఆమె యిష్టాయిష్టాల్తో కూడా పనిలేదా? ఒకే వస్తువు వివిధ వ్యక్తులకు వివిధ విధాలుగా కన్పించటమూ, భేదాభిప్రాయాల్ని యివ్వటమూ ఈనాటికీ కొత్తకాదుగా!