Book Description
ధర్మ-అర్థ-కామ-మోక్షములు అనబడే నాలుగు పురుషార్ధాలలో మూడవదయిన ‘కామం’ భారతీయ సమాజంలో బాహాటంగా మాట్లాడకూడని అంశంగా ముద్ర పడింది. అయితే దాంపత్య జీవితంలో కామానికి కీలకమైన పాత్ర వుందని నమ్మి, ఈ అంశంపై సమగ్రమైన ఒక శాస్త్రాన్నే రచించిన వారిలో వాత్స్యాయన మహర్షి ప్రముఖుడు. ఈయన క్రీస్తుపూర్వం వాడని కొంతమంది, క్రీస్తు శక ఆరంభంలో జన్మించిన వాడని కొంతమంది వాదిస్తుంటారు. ఎలా తీసుకున్నా, ‘వాత్స్యాయన కామ సూత్రాలు’ దాదాపు 2000 సంవత్సరాల క్రితం సంస్క•తంలో రచించబడిన గ్రంథం. ఈ రచనకు ఆధారమైన కామశాస్త్రం అనేది ఈశ్వరుణ్ణి అంటిపెట్టుకుని వుండే నందీశ్వరుడి నుండి లభించిందని ఈ గ్రంథం పేర్కొంటోంది.