Book Description
‘‘నాకు అసలు మనసే లేదు. మీరు కళ్లు లేని వాళ్ళనీ.... చేతులు లేని వాళ్ళనీ చూసి వుంటారు. కానీ మనసు లేని వాళ్ళని చూసి వుండరు! ఇప్పుడు చూడండి... నాకు మనసు లేదు. మనసే కాదు జాలీ, దయ, బాధ కూడా లేవు! ఎందుకుండాలి? పుట్టగానే పసిగుడ్డు అనైనా లేకుండా చెత్త కుండీలో కుక్కలకి ఆహారంగా వేసిన నా తల్లికి లేని మనసు.. నాకు ఎక్కడనుంచి వస్తుంది? అమ్మవారి జ్వరంతో వళ్ళు తెలియకుండా పడివున్న నన్ను ధర్మాసుపత్రికి తీసుకెళ్తే ఎవరూ చూడకుండా నన్ను రేప్ చేయబోయిన వార్డ్బోయ్‍కి లేని దయ నాకెందుకూ? కార్లలో తిరుగుతూ, ఫైవ్ స్టార్ హోటల్స్లో మీరు విలాసంగా తింటూ వుంటే... మేం పురుగుల బియ్యం, ముక్క వాసన కొట్టే పప్పుతో కడుపు నింపుకోవాలేం? మా శరీరాల్ని కప్పుకోవడానికి బట్ట ముక్క కరువుగా వుంటే... మీరు మాత్రం బీరువా పట్టనన్ని బట్టలు కొనుక్కుంటారేం? మీరేమైన తల మీద కొమ్ములతో పుట్టారా? పైవాడ్ని కాకా పట్టి ఇటువంటి జాతకాలు వ్రాయించుకున్నారా?’’ కసి తప్ప కారుణ్యం తెలియని, ద్వేషం తప్ప దయలేని, ఆడంబరం తప్ప అనురాగం అంటే అర్థం తెలియని ఒక అనాధ అమ్మాయి కథ ఖజురహో!