Book Description
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, సుమతీ, భాస్కర, వేమన శతకాల ఆధారంగా ‘భారతీయ వ్యక్తిత్వ వికాసా’న్ని విశ్లేషిస్తూ, వివరిస్తూ రచించిన వ్యాసాల సంకలనం ఈ పుస్తకం. భారతీయ సాహిత్యం వ్యక్తిత్వ వికాస సాగరం. ఆ సాగరంలో శోధించి సాధించిన కొన్ని మణుల సంకలనం ఈ పుస్తకం. ఈ పుస్తక పఠనం ద్వారా భారతీయ సాహిత్యసాగరం లోతులలో విహరించాలన్న జిజ్ఞాస కనీసం ఆ సాగర జల ప్రవాహాన్ని స్ప•శించాలన్న కోరిక, ఆసక్తి ఏ ఒక్కరికి కలిగినా ఈ ప్రయత్నం విజయవంతమైనదిగా భావిస్తాము.